Chhattisgarh CM: వెనుకంజ‌లో చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం

by Vinod kumar |
Chhattisgarh CM: వెనుకంజ‌లో చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం భూపేశ్ భ‌గేల్ వెనుకంజ‌లో ఉన్నారు. ప‌టాన్ సీటు నుంచి ఆయ‌న పోటీలో ఉండగా.. రెండో రౌండ్ కౌంటింగ్ త‌ర్వాత భూపేశ్ భ‌గేల్ అల్లుడు విజ‌య్ భ‌గేల్ లీడింగ్‌లో ఉన్నారు. రాజ్‌నంద‌గావ్‌లో బీజేపీ నేత ర‌మ‌ణ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం.. 90 స్థానాలు ఉన్న చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీజేపీ 49 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ఇక్కడ హంగ్ ఏర్పడే అవ‌కాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. ఫ‌లితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా మారాయి.



Next Story