నాగాలాండ్‌లో కలకలం: భారీగా ఆయుధాలు స్వాధీనం

by samatah |
నాగాలాండ్‌లో కలకలం: భారీగా ఆయుధాలు స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో అస్సాం రైఫిల్స్ బలగాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దుకు దగ్గరలోని ప్రాంతంలో ఆయుధాలకు సంబంధించిన సమాచారం అందడంతో అస్సాం రైఫిల్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో 11 మోర్టార్ ట్యూబ్‌లు, 10 తుపాకులు, 198 హ్యాండ్ హెల్డ్ రేడియోతో పాటు అధిక మొత్తంలో మందుగుండు సామగ్రి లభ్యమైంది. అలాగే పిస్టల్స్, శాటిలైట్ ఫోన్, ఒక కెన్బో బైక్, ఒక బొలెరో వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు.

సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఓ అనుమానిత వ్యక్తిని కూడా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సీజ్ చేసిన వస్తువులు, అరెస్టు చేసిన వ్యక్తిని నాగాలాండ్ పోలీసులకు అప్పగించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ‘సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ హెవీ-క్యాలిబర్ మిలిటరీ గ్రేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం అస్సాం రైఫిల్స్ చేపడుతున్న సరిహద్దు సీలింగ్ ఆపరేషన్‌కు ఒక పెద్ద విజయం. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ’ అని అస్సాం రైఫిల్స్ తెలిపింది.

Advertisement

Next Story