అగ్నివీర్ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపింది.. సవరణలు చేయాలి: కెసి త్యాగి

by Harish |
అగ్నివీర్ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపింది.. సవరణలు చేయాలి: కెసి త్యాగి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రం అగ్నివీర్ పథకంలో సవరణలు చేయాలని గురువారం జేడీ(యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి అన్నారు. అగ్నివీర్ పథకం ప్రవేశ పెట్టినప్పటి నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. అలాగే ప్రస్తుతం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం తీవ్ర చర్చలకు దారితీసింది. కొన్ని ప్రాంతాల్లో ఈ అంశం ఓట్లపై ప్రభావాన్ని చూపింది. అందుకే ఈ పథకంలో మార్పులు(సవరణలు) చేయాలని త్యాగి కోరారు. అగ్నివీర్ పథకంపై ఓ వర్గం ఓటర్లు కలత చెందారు. దానిలో ఉన్న లోపాల గురించి కూలంకషంగా చర్చించి వాటిని తొలగించాలని మా పార్టీ కోరుతోంది, యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లా కమిషన్ చీఫ్‌కి సీఎం లేఖ రాశారు. మేము దీనికి వ్యతిరేకం కాదు, అయితే భాగస్వామిలందరితో మాట్లాడి పరిష్కారం కనుగొనాలని జేడీ(యు) అధికార ప్రతినిధి త్యాగి అన్నారు.

తాజా ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) మద్దతు కీలకం కానుంది. ఈ తరుణంలో అగ్నివీర్ పథకంలో మార్పులు కోరుతున్న జేడీ(యు) ప్రతిపాదనలకు బీజేపీ అంగీకరించే అవకాశం లేకపోలేదు. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కూడా అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉత్తరప్రదేశ్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను రద్దు చేసి, పాతదానికి తిరిగి వస్తామని కాంగ్రెస్ సైతం హామీ ఇచ్చింది .

Advertisement

Next Story

Most Viewed