- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Chandrayaan-3: చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్-3..
బెంగళూరు : చంద్రయాన్-3కి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కొత్త అప్ డేట్ను ప్రకటించింది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ మరో ప్రదక్షిణను పూర్తి చేసి.. చంద్రుడికి మరింత దగ్గరగా చేరుకుందని బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడి ఉపరితలానికి దగ్గరలోనే స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతోందని తెలిపింది. బుధవారం ఉదయం చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను 174 కి.మీ x 1437 కి.మీకు తగ్గించినట్లు పేర్కొంది. తదుపరిగా ఆగస్టు 14న ఉదయం 11.30 నుంచి 12.30 మధ్యలో కక్ష్యలో మార్పులు చేస్తామని చెప్పింది. ఆ మార్పుల తర్వాత.. ఆగస్టు 16న చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ చేరుకుంటుందని ఇస్రో వివరించింది.
ఆ మరునాడే (ఆగస్టు 17న) స్పేస్ క్రాఫ్ట్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుందని తెలిపింది. ఈ క్రమంలో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 6000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. ల్యాండింగ్ మాడ్యూల్లో ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రగ్యాన్) ఉంటాయని, ఇది ల్యాండ్ అయ్యేటప్పుడు గంటకు 10 కిలోమీటర్ల వేగం ఉంటుందని చెప్పింది. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు రోవర్ తో కూడిన ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ అవుతుందని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.