జయహో భారత్: చంద్రుడిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. అంతరిక్ష రంగంలో ఇస్రో సరికొత్త చరిత్ర

by Satheesh |   ( Updated:2023-09-09 14:01:03.0  )
జయహో భారత్: చంద్రుడిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్.. అంతరిక్ష రంగంలో ఇస్రో సరికొత్త చరిత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉత్కంఠకు తెరపడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్- 3 ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇవాళ విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడంతో అంతరిక్ష రంగంలోనే ఇస్రో అమ్ముల పొదిలో మరో అరుదైన రికార్డ్ నమోదు అయ్యింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ప్రపంచదేశాలలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఇస్రో సైంటిస్ట్‌లు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, జూలై 14వ తేదీన శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఇస్రో చంద్రయాన్ -3 ప్రయోగం చేపట్టింది. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మొత్తం 41 రోజుల్లో వివిధ దశలను పూర్తి చేసుకుని చంద్రుడి దగ్గరికి చేరుకుంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 విఫలం కావడంతో సైంటిస్ట్‌లు ఈ సారి జాగ్రతత్తో చంద్రయాన్- 3 స్పేస్ క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్‌ను ఇవాళ సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ చేసి అరుదైన చరిత్రకు శ్రీకారం చుట్టింది.

Advertisement

Next Story

Most Viewed