- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూన్ 4 తర్వాత 'నితీశ్ మామ' మరో సంచలన నిర్ణయం: తేజస్వి యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆయన అల్లుడు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న తన మామ నితీశ్ కుమార్ జూన్ 4 తర్వాత తిరిగి ఇండియా కూటమిలో చేరవచ్చని అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల రాజకీయాలను, పార్టీని కాపాడేందుకు మా 'మామా' ఏదైనా చేయగలరు. జూన్ 4 తర్వాత ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటారని' తెలిపారు. నితీశ్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలుపుతారా అని అడిగినప్పుడు.. ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మీరే చూస్తారని అన్నారు. గత దశాబ్ద కాలంలో నితీష్ కుమార్ ఐదుసార్లు కూటములను మార్చారు. ఇటీవల జనవరిలో ఇండియా కూటమిని వీడి ఎన్డీయేలోకి మారిన తర్వాత కూడా ఇదే చివరిసారని చెప్పారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు సమయంలో నితీశ్ తొలిసారి పాట్నాలో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీట్ల పంపకంలో కాంగ్రెస్ జాప్యం చేస్తొందని ఆరోపిస్తూ కూటమి నుంచి బయటకు వచ్చారు. బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీఏలో భాగంగా జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ 17 స్థానాల్లో నిలబడింది. ఇండియా కూటమిలో ఆర్జేడీ 23 సీట్లలోనూ, కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి.