నీట్ స్కాం ఎఫెక్ట్.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ తొలగింపు.. కొత్త చీఫ్ ఎవరంటే?

by Shamantha N |   ( Updated:2024-06-22 17:42:08.0  )
నీట్ స్కాం ఎఫెక్ట్.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ తొలగింపు.. కొత్త చీఫ్ ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ - యూజీ, యూజీసీ - నెట్ పరీక్షలపై వివాదాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగించింది. ఎన్టీఏ కొత్త చీఫ్ గా ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక కేడర్ కు చెందిన ప్రదీప్ సింగ్ ఖరోలా 2017లో ఎయిరిండియా హెడ్ గా నియమితులయ్యారు. 2019లో ఏవియేషన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత, 2022 నుంచి ఐటీపీవో ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎన్టీఏ డీజీగా ప్రదీప్ సింగ్ కొనసాగనున్నారు. నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలతో విద్యార్థులు, విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రవేశపరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed