భారత సైన్యానికి 34 ధృవ్ హెలికాప్టర్లు

by Hajipasha |
భారత సైన్యానికి 34 ధృవ్ హెలికాప్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ రకానికి చెందిన 34 ధ్రువ్ హెలికాప్టర్ల కొనుగోలు ప్రతిపాదనకు దేశ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం దాదాపు రూ.8వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు చెల్లించనుంది. ‘హాల్’ అందించనున్న ధ్రువ్ హెలికాప్టర్లలో 25 భారత ఆర్మీకి, 9 ఇండియన్ కోస్ట్ గార్డ్‌ విభాగానికి కేటాయించనున్నారు. మన దేశంలో సైనిక హెలికాప్టర్ల తయారీకి దన్నుగా నిలిచేందుకు ఈ ఆర్డర్ ఊతమిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత సైన్యం వినియోగించే రష్యాకు చెందిన ‘బీఎంపీ’ పదాతిదళ పోరాట వాహనాలను అప్‌గ్రేడ్ చేయడానికి సంబంధించిన ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది.

Advertisement

Next Story