కేంద్రం కీలక నిర్ణయం.. సరోగసీ ద్వారా తల్లులయ్యే వారికి ఆరు నెలల ప్రసూతి సెలవులు

by S Gopi |
కేంద్రం కీలక నిర్ణయం.. సరోగసీ ద్వారా తల్లులయ్యే వారికి ఆరు నెలల ప్రసూతి సెలవులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్ల నాటి నిబంధనను సవరిస్తూ.. సరోగసీ ద్వారా తల్లులయ్యే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజుల(ఆరు నెలలు) పాటు ప్రసూతి సెలవులకు అనుమతిచ్చింది. సరోగసీ అనేది అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(సెలవుల) రూల్స్-1972 నియమాల్లో మార్పుల ప్రకారం, తల్లి(సరోగసీ ద్వారా గర్భం దాల్చిన మహిళ) పిల్ల సంరక్షణ కోసం సెలవు తీసుకునే వీలుంటుంది. తల్లితో పాటు తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవులను తీసుకోవచ్చు. అయితే, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదని కేంద్రం షరతు విధించింది. ఈ మార్పునకు సంబంధించి గత వారంలోనే ఉత్తర్వులిచ్చినప్పటికీ, జూన్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం వెలువరించిన నిబంధనల ప్రకారం, సరోగసీతో పాటు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న తల్లికి 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం మొత్తం ఉద్యోగ సర్వీసు కాలంలో 730 రోజుల చైల్డ్‌కేర్ లీవ్ మహిళ లేద పురుష ఉద్యోగికి అందుతుంది.

Advertisement

Next Story

Most Viewed