కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెంపు

by GSrikanth |
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యరంగంలోకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 800 రకాల మందుల రేట్లు పెరగబోతున్నాయి. వీటిలో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ తదితర మందులు ఉన్నాయి. కేంద్ర ఆదేశాలతో నేషనల్ లిస్టు ఆఫ్​ఎసేన్షియల్ మెడిసిన్ ధరలను ప్రస్తుత ధరలకు అదనంగా 0.55 శాతం పెంచనున్నారు. బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులకు వినియోగించే యాంటీబయాటిక్స్ తదితర మెడిసిన్స్ రేట్లు పెరగనున్నట్లు డ్రగ్ ఆథారిటీ ఆఫీసర్లు తెలిపారు.

Advertisement

Next Story