CBSE Results: సీబీఎస్ఈ సప్లమెంటరీ ఫలితాలు రిలీజ్.. పెరిగిన ఉత్తీర్ణతా శాతం

by vinod kumar |
CBSE Results: సీబీఎస్ఈ సప్లమెంటరీ ఫలితాలు రిలీజ్.. పెరిగిన ఉత్తీర్ణతా శాతం
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10,12 తరగతుల సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ cbse .gov.inలో తెలుసుకోవచ్చు. లాగిన్ పేజీలో వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు ఇతర వివరాలను ఉపయోగించి మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలో మొత్తం ఉత్తీర్ణతా శాతం 93.60గా ఉంది. ఇది గతేడాది కంటే 0.48శాతం ఎక్కువ. 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 2023లో 87.33 శాతం నుంచి ఈ ఏడాది 87.98 శాతానికి పెరిగింది. ఇది గతేడాది కంటే 0.65 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కాగా, సీబీఎస్ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు జూలై 15న, 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్ష జూలై 15 నుంచి 22 వరకు నిర్వహించారు. మొత్తం 1, 22, 170 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యారు. సప్లమెంటరీ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించని వారు వచ్చే ఏడాది మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed