- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంగాజలానికి 18 శాతం జీఎస్టీ.. సీబీఐసీ క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఇళ్లలో పూజ కోసం వినియోగించే గంగాజలానికి జీఎస్టీ వేధిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై బోర్డు ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) క్లారిటీ ఇచ్చింది. గంజా జలంపై జీఎస్టీ విధించడం లేదని స్పష్టం చేసింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి గంగాజలంపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని, దేశవ్యాప్తంగా ఇళ్లలో వినియోగించే గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు కొనసాగుతోందని తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ 14,15 సమావేశాల్లో పూజా సామాగ్రిపై జీఎస్టీ అంశంపై చర్చకు వచ్చినా వాటికి మినహాయింపు జాబితాలోనే ఉంచాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో ఉండగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రం గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధింస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐసీ ఈ మేరకు స్పందించింది.
Clarification regarding certain media reports on applicability of GST on Gangajal. pic.twitter.com/t598ahN07x
— CBIC (@cbic_india) October 12, 2023