నీట్ పేపర్ లీకేజీ కేసు.. నకిలీ టీమ్‌గా భావించి బీహార్‌లో సీబీఐ బృందంపై గ్రామస్తుల దాడి

by S Gopi |   ( Updated:2024-06-23 16:47:59.0  )
నీట్ పేపర్ లీకేజీ కేసు.. నకిలీ టీమ్‌గా భావించి బీహార్‌లో సీబీఐ బృందంపై గ్రామస్తుల దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం బీహార్ వెళ్లిన సీబీఐ బృందంపై నవాదా గ్రామస్తులు దాడి చేశారు. అయితే, వచ్చిన సీబీఐ అధికారులు ఫేక్ బృందంగా భావించిన గ్రామస్తులు వారిని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 200 మందిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. వారిలో ఎనిమిది మంది పేర్లు మాత్రమే కేసులో నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశామని, దాని ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించామని పోలీసులు తెలిపారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో సీబీఐ బృందం కసియాది గ్రామంలో ఉన్నారని, స్థానిక పోలీసులు రావడంతో అధికారులను రక్షించగలిగామని అంబరీష్ రాహుల్ అనే సీనియర్ పోలీస్ చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేసు విషయమై నలుగు అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్ ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేస్తూ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే, గ్రామస్తులు నకిలీ అధికారులుగా భావించి దాడి చేసి, వాహనాలను ద్వంసం చేశారు. వారిని ఎదుర్కొని సీబీఐ టీమ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పారు. అనంతరం స్థానిక పోలీసుల సమక్షంలోనే సీబీఐ టీమ్ విచారణ చేపట్టారు. రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed