ఏటా 2.5 శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి

by Shamantha N |
ఏటా 2.5 శాతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నడ్డా సమాధానమిచ్చారు. "క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 2.5 శాతం పెరుగుతోంది" అని చెప్పారు. క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరలోచికిత్స, మందులు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు. పురుషుల్లో నోటి, ఊపిరితీత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఎక్కువ మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. "131 ముఖ్యమైన క్యాన్సర్ ఔషధాల జాబితా ఉంది. అవి షెడ్యూల్ 1లో ఉన్నాయి. వాటి ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది” అని చెప్పారు.ఈ ధరల నియంత్రణ వల్ల రోగులు దాదాపు ₹ 294 కోట్లు ఆదా చేశారని ఆయన అన్నారు. 28 కాంబినేషన్ల క్యాన్సర్ మందులు ఉన్నాయని.. అవి షెడ్యూల్ 1 జాబితాలో లేవన్నారు. కానీ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ, ప్రభుత్వం వాటి ధరలను కూడా నియంత్రించిందన్నారు.

మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోంది

హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మరో ప్రశ్నకు నడ్డా స్పందించారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని అన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా.. ప్రస్తుతం 731కి పెరిగిందన్నారు. అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 నుంచి 1.12 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. 2014లో వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్యాడ్యుయేట్ సీట్లు 31,185 ఉండగా.. అది 72,627కి పెరిగిందన్నారు.



Next Story