Bypolls: ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..

by Vinod kumar |
Bypolls: ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..
X

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సెప్టెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 8వ తేదీన జరుగుతుందని పేర్కొన్నది. ఆగస్టు 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లకు తుది గడువును ఆగస్టు 17వ తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 18న స్క్రూటినీ జరుగుతుంది. ఆగస్టు 21వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాలి.

ఈ ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తారు. కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఇటీవల మరణించడంతో ఖాళీ అయిన కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఊమెన్ చాందీ ఐదు దశాబ్దాలుగా పుతుపల్లి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్, జార్ఖండ్‌లోని డుమ్రీ, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ నియోజక వర్గాల్లోనూ కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed