- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BUDGET-2024: అందరి చూపు నిర్మలా బడ్జెట్ వైపు.. పేద, మధ్య తరగతి ప్రజలను సంతోషపెడతారా.. సాధిస్తారా?
దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 1న 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమవుతున్న తరుణంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కొంగొత్త ఆశలు మెదలుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు, ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించి ఏవైనా చర్యలు తీసుకుంటారా అనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఆదాయ పన్ను చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వేతనాలు తీసుకుంటున్న వారికి పన్ను చెల్లింపు విషయంలో అదనపు ఉపశమనాన్ని కలింగించే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా మౌలిక సదుపాయాల వ్యయం, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన కొన్ని కీలక సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగే అవకాశం ఉందని టాక్.
కాగా, ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆత్మవిశ్వాసంలో మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి కఠినమైన సమస్యలను పరిష్కరించి దేశ ప్రజల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే మళ్లీ మధ్యతర బడ్జెట్‌తో ప్రజలకు తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రజాకర్షక బడ్జెట్ ప్రకటించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇదే అంశంపై క్యాపిటల్ ఎకనామిక్స్‌లో డిప్యూటీ చీఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎకనామిస్ట్ షిలాన్ షా మాట్లాడుతూ.. రాబోయే కాలం సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమ ఫలాలను ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.