- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రగ్స్ వయా డ్రోన్స్.. పాక్ సరిహద్దులో సీజ్ చేసిన బీఎస్ఎఫ్
దిశ, తెలంగాణ బ్యూరో : భారత్-పాక్ సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో డ్రోన్ల సాయంతో డ్రగ్స్ రవాణా పెరిగిపోతున్నది. గడచిన రెండు నెలల వ్యవధిలో దాదాపు అరడజను డ్రోన్లను పోలీసులు కూల్చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఆదివారం అర్ధరాత్రి (తెల్లవారితో సోమవారం) ఒక డ్రోన్ గాలిలో ఎగురుతుండడాన్ని బీఎస్ఎఫ్ పోలీసులు పసిగట్టారు. డ్రోన్‌కి దిగువ భాగంలో వెలుగుతున్న లైట్ ఆధారంగా దూరం నుంచే పసిగట్టి నిశితంగా పరిశీలించిన తర్వాత డ్రోన్ శబ్దాన్ని గ్రహించారు.
పిరోజ్‌పూర్ జిల్లా సీతావాలె గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఎగురుతున్న డ్రోన్‌ను కూల్చివేసిన భారత బీఎస్ఎఫ్ దళాలు అందులో రవాణా అవుతున్న రెండున్నర కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు ప్యాకెట్లలో సీల్ చేసి ఉన్న హెరాయిన్‌తో పాటు రెండు బాల్స్, ఒక బ్లూ కలర్ ఎల్ఈడీ బల్బు, బ్యాటరీ తదితరాలను కూడా సీజ్ చేశారు. భారత్‌లోకి డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఈ డ్రగ్స్ ను గత కొంతకాలంగా రవాణా చేస్తూ ఉన్నట్లు పలు సంఘటనల ద్వారా బీఎస్ఎఫ్ బలగాలు ధృవీకరించుకున్నాయి.