- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: కాంగ్రెస్ తప్పుడు ప్రచారం వెనుక అతడి హస్తం ఉంది.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో తమపై హస్తం పార్టీ బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ప్రస్తతం ఆ పార్టీ దేశంలో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని, అందుకే ప్రస్ట్రేషన్‌తో తమ నినాదానలను తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చివరికి కాంగ్రెస్ అమేథిలో పోటీ చేసేందుకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లను పరిరక్షిస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందని, సీట్లు కూడా పెరుగుతాయని అన్నారు. తొలి రెండు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల్లో గెలుస్తోందని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. 400 సీట్లలో ఎన్డీఏ విజయం ఖాయమని, బంపర్ మెజారిటీతో మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.