అయోధ్యలో గుడి నుంచి బయటకు వచ్చిన బాల రాముడు (వీడియో)

by Disha Web Desk 12 |
అయోధ్యలో గుడి నుంచి బయటకు వచ్చిన బాల రాముడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువుల 500 సంవత్సరాల కల జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన‌తో నెరవేరింది. ఈ క్రమంలో వచ్చిన మొదటి శ్రీరామనవమి వేడుకలను అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామనవమి వేళ అయోధ్యలో వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో బాల రాముడు గుడి నుంచి బయటకు రావడం కనిపించింది. దీంతో బాలరాముడిని చూసేందుకు భక్తులు ఎగబడగా.. అతను ఓ సాధారణ బాలుడి అని.. రామ్ లల్లా వేషధారణలో ఉన్నాడని గ్రహించారు. అయినప్పటికి రామ్ లల్లా విగ్రహాన్ని పోలినట్లే ఉండటంతో అతనితో ఫోటోలు దిగేందుకు అక్కడి వారు ఎగబడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాముడి వేషంలో ఉన్న బాలుడు అచ్చం రామ్ లల్లా మాదిరిగా కనిపించడం విశేషం.

Next Story

Most Viewed