మే-1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు.. ఎక్కడ మొదలైందంటే?

by Disha Web Desk 6 |
మే-1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు.. ఎక్కడ మొదలైందంటే?
X

దిశ, ఫీచర్స్: ప్రతి ఏడాది మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఇదే రోజున కార్మికులు వారి హక్కులు గుర్తు చేసుకుంటారు. అలాగే సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించి ఈరోజున కొందరిని సన్మానించడం. అయితే ఈ రోజున ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటిస్తారు. మేడే 1886లో షికాగోలోని హె మార్కెట్‌లో జరిగిన కార్మిక ప్రదర్శనలోనే కార్మికుల దినోత్సవం స్టార్ట్ అయింది. అసలు ఎక్కడ.. ఎప్పుడు మొదలైందో అనేది ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళితే.. మే 1వ తేదీన 1886లో 2 లక్షల మంది కార్మికులు భారీ సమ్మె చేశారు. ఎనిమిది గంటల పనిదినం చేయాలని బాలకార్మికులు, తక్కువ వేతనాల గురించి పోరాడినట్లు సమాచారం. ఇది షికాగోలోని హెమార్కెట్ స్క్వేర్‌లో శాంతియుతంగా జరిగింది. కానీ ఇందులో బాంబు పేలడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం దిగొచ్చి 1894లో కార్మిక దినోత్సవంను ప్రకటించడంతో పాటుగా సెలవు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఆ తర్వాత కొద్ది కాలానికి 1916లో మొట్టమొదటిసారిగా రోజులో కేవలం ఎనిమిది గంటల పనిదినాన్ని ప్రభుత్వం అంగీకరించారు. ఆ తర్వాత 1917 నుంచి కొన్ని దేశాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నాయి. అయితే భారతదేశంలో మాత్రం మొట్టమొదటిసారి మే 1వ 1923లో కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ రోజున కార్మికులు, శ్రామికులు పనితీరును గుర్తించి కొన్ని చోట్ల పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Next Story

Most Viewed