- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబ్ బెదిరింపులు
దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. రెండు వారాల క్రితం సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్ ఆవరణలో బాంబులు ఉన్నాయని ఈమెయిల్ బెదిరింపులకు పాల్పడగా...తాజాగా మరో పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బుధవారం మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూలు ఆవరణలో బాంబులున్నాయంటూ అందులో పేర్కొనడంతో వెంటనే యాజమాన్యం అప్రమత్తమైంది.
తక్షణమే సిబ్బంది, విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా..ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ప్రస్తుతం ఈ-మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 8.10 గంటల ప్రాంతంలో పాఠశాల అధికారుల నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. వెంటనే పాఠశాలను ఖాళీ చేయించారు.