- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: RBI ప్రధాన కార్యాలయానికి బాంబ్ బెదిరింపు కాల్
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని బాంబ్ పెట్టి పేల్చేస్తామని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఆర్బీఐ ఆఫీస్‌తో పాటు ముంబైలోని ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్యాలయాలకు సైతం ఇదే తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ పెట్టి పేల్చేస్తామని దుండగులు మెయిల్ చేశారు. బాంబ్ బెదిరింపు కాల్ నేపథ్యంలో అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్, జీ మెయిల్ ఎక్కడ నుండి వచ్చాయనే దానిపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయాల వద్ద హై అలర్ట్ ప్రకటించి.. పోలీసులు భద్రతను మరింత పెంచారు. కాగా, ఇప్పటికే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ముంబై వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.