- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలి: బీజేపీ
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. వేర్వేరు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి కోర్టుక నివేదిక సమర్పించింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో దేశ ప్రజలకు, ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రజలకు బీజేపీ కీలక సూచన చేసింది.
కోర్టును అందరూ గౌరవించాలని కోరింది. తీర్పు వ్యతికేకంగా వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోమని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావొచ్చని మరో మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. మరోవైపు రెండు వారాలుగా కాశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. తీర్పుపై భిన్నంగా స్పందించి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.