- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికలయ్యే దాకా ఆ సినిమాలు బ్యాన్ చేయండి.. ఈసీకి బీజేపీ లేఖ
దిశ, నేషనల్ బ్యూరో : ఇది ఎన్నికల సీజన్. ఈ ఎఫెక్టు క్రమంగా ప్రతీ రంగంపైనా పడుతోంది. సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలనూ వదలడం లేదు. తాజాగా ఎన్నికల సెగ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌ను తాకింది. ఆయనను బీజేపీ టార్గెట్‌గా ఎంచుకుంది. ఎందుకంటే.. శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరఫున షిమోగా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం తన సతీమణి తరఫున ఎన్నికల ప్రచారంలో శివరాజ్ కుమార్ బిజీగా ఉన్నారు. కన్నడ నాట శివరాజ్ కుమార్‌కు మంచి పాపులారిటీ ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ సినిమాలు, యాడ్స్, బిల్ బోర్డు డిస్‌ప్లేలను బ్యాన్ చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కర్ణాటక బీజేపీ లేఖ రాసింది. ఈమేరకు శివరాజ్ కుమార్‌పై కర్ణాటక బీజేపీ సీనియర్ నేత రఘు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లేఖను పంపారు. శివరాజ్ కుమార్ సినిమాలు ఎన్నికల సమయంలో ప్రజలపై ప్రభావం చూపుతాయని, అందుకే తాము ఈసీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని రఘు తెలిపారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.