- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్టోరల్ బాండ్స్ చిట్టా : ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యాయి. ఎస్‌బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రమే విప్పేసింది. దీంతో ఏయే రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి ? ఆ విరాళాలను ఇచ్చిన దాతలు ఎవరు ? అనేది వెలుగులోకి వచ్చింది. 763 పేజీల్లోని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ eci.gov.inలో అందుబాటులో ఉంచారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతధంగా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టామని తెలిపింది. ఈ లిస్టు ప్రకారం.. యావత్ భారత్‌లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా రూ.12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆపార్టీకి రూ. 6,061 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండో ప్లేస్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. దానికి రూ.1,610 కోట్లు వచ్చాయి. మూడో ప్లేస్‌లో నిలిచిన కాంగ్రెస్‌కు రూ.1,422 కోట్లు, నాలుగో ప్లేసులో భారత రాష్ట్ర సమితి నిలిచింది. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు రూ. 776 కోట్లు, తమిళనాడును పాలిస్తున్న డీఎంకే పార్టీకి రూ.639 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.337 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.219 కోట్లు, జనసేన పార్టీకి రూ.21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.158 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.65 కోట్లు విరాళంగా అందాయి.
ఏ పార్టీకి ఎన్ని బాండ్లు ?
2018 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అత్యధికంగా 8,633, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 3,305, కాంగ్రెస్ పార్టీకి 3,146, ఆమ్ ఆద్మీ పార్టీకి 245, డీఎంకేకు 648, బాండ్ల జారీ ద్వారా డొనేషన్స్ వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 1,806 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 472, టీడీపీకి 279, జనసేన పార్టీకి 39 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందాయి.
కంపెనీలు అందించిన విరాళాలు
ఎంత మొత్తం - ఎన్ని సార్లు
రూ.1 కోటి - 11,671
రూ.10 లక్షలు - 4,620
రూ.1 లక్ష - 2,228
రూ.10వేలు - 220
రూ.1 వెయ్యి - 132
*****************
రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలు
ఎంత మొత్తం - ఎన్నిసార్లు
రూ.1 కోటి - 12,207
రూ.10 లక్షలు - 5,366
రూ.1 లక్ష - 2,526
రూ.10వేలు - 219
రూ.1,000 - 103