ఓట్ల కోసమే బీజేపీ ‘సీఏఏ సీఏఏ’ అని ఏడుస్తోంది: కేంద్ర మంత్రి ప్రకటనపై మమతా బెనర్జీ విమర్శలు

by samatah |
ఓట్ల కోసమే బీజేపీ ‘సీఏఏ సీఏఏ’ అని ఏడుస్తోంది: కేంద్ర మంత్రి ప్రకటనపై మమతా బెనర్జీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ చేసిన ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే బీజేపీ ‘సీఏఏ సీఏఏ’ అని ఏడ్వడం ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కూచ్ బిహార్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని కాలనీలను శాశ్వత చిరునామాలుగా గుర్తించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్న నివాసితులందరూ దేశ పౌరులేనని స్పష్టం చేశారు. ‘మేము రాష్ట్రంలోని అన్ని కాలనీలకు పర్మినెంట్ అడ్రస్ ఇచ్చాం. ఇక్కడి ప్రజలంతా రేషన్, స్కాలర్‌షిప్‌లు, కిసాన్ బంధు, లక్ష్మీ భండార్ ప్రయోజనాలు పొందుతున్నారు. పౌరులు కాకపోతే వీటిని ఎలా పొందగలరు? పౌరులు కాకపోతే వారు ఓట్లు వేయగలిగేవారా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నదని మండిపడ్డారు.

Advertisement

Next Story