- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2029 నాటికి బీజేపీ రహిత భారత్: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే 2029లో మాత్రం బీజేపీ రహిత భారత్‌ను తయారు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీకి అతిపెద్ద సవాల్ అని, అందుకే అన్ని వైపుల నుంచి ఆప్ పై దాడి జరుగుతుందని తెలిపారు. బీజేపీ కేవలం ఆప్‌కి మాత్రమే భయపడుతుందని చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ నన్ను అరెస్టు చేయొచ్చేమో గానీ నా ఆలోచనలను మాత్రం అంతం చేయలేదని స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, 2029లో బీజేపీ నుంచి ఆప్ దేశాన్ని విముక్తి చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు రామభక్తులమని చెప్పుకుంటున్నారని, కానీ ఆస్పత్రుల్లో పేదలకు మందులు ఇవ్వడం మానేశారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఊహాగానాల వల్లే విశ్వాస పరీక్ష పెట్టానని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఈ సమయంలో 62 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో 54 మంది సభలో ఉన్నారు. దీంతో మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. గతేడాది మార్చి 29న సైతం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని కేజ్రీవాల్ ప్రవేశపెట్టారు.