స్వాతంత్ర్య సమరయోధులను చిన్న చూపు చూసేందుకు బీజేపీ ప్రయత్నం: సోనియా

by Javid Pasha |
స్వాతంత్ర్య సమరయోధులను చిన్న చూపు చూసేందుకు బీజేపీ ప్రయత్నం: సోనియా
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అధికార బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను చిన్న చూపు చూసేందుకు బీజేపీ పార్టీ ఎంతో కష్టపడుతుందని సోనియా గాంధీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసే ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో సహించదని సోనియా తెలిపారు. 'స్నేహితులారా.. మనం గత 75 ఏళ్లలో ఎన్నో గొప్ప గమ్యాలను అందుకున్నాం. కానీ ఈ రోజు స్వీయ నిమగ్నమైన ప్రభుత్వ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, దేశం సాధించిన అద్భుతమైన లక్ష్యాలను చిన్న చూపు చేసే ప్రయత్నం చేస్తుంది. అది ఏమాత్రం సహించలేనిది' అని సోనియా అన్నారు.

అయితే ఆదివారం 1947లో భారతదేశ విభజనకు దారి తీసిన ఘటనలను వివరిస్తున్న వీడియో బీజేపీ విడుదల చేసింది. మరుసటి రోజే బీజేపీ పార్టీ చర్యలపై సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ విడుదల చేసిన వీడియోలో బీజేపీ ఆనాటి కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఆరోపించింది, అంతేకాకుండా నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా చిత్రాలను వీడియోలో చూపించడం జరిగింది. దీంతో పాటుగా కర్ణాటక రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరయోదులపై వచ్చిన ప్రకటనలో నెహ్రూ ఫొటో లేకపోవడంపై సోనియా ఘాటుగా స్పందించారు. బీజేపీ చేస్తున్న ఈ చర్యలు అత్యంత దయనీయమని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed