- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇకపై ఆ పిల్లలకు పౌరసత్వం రద్దు.. ట్రంప్ మరో కీలక ఆదేశాలు జారీ

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్ట్ ట్రంప్ తనదైన స్టైల్‌లో పాలన మొదలుపెట్టారు. ఇప్పటికే పలు కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన ఆయన.. అమెరికా పౌరులు కాని వారికి ఆ గడ్డపై పుట్టే పిల్లలకు సహజంగా పౌరసత్వం అందించడాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14 రాజ్యాంగ సవరణ ప్రకారం. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయిన అక్కడ పుట్టే పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. అయితే ఇవాళ్టి నుంచి అలాంటి జన్మహక్కును ఫెడరల్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, అక్రమంగా ప్రవేశించిన ఏలియన్స్ ఏరివేత కోసం పరిశీలన, స్క్రీనింగ్ చేపడతామని వ్యాఖ్యానించారు.
అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ సహజంగా ఆ దేశ పౌరసత్వం ఇచ్చే విధానం దాదాపు శతాబ్ద కాలంగా అమలులో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేయటంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలో పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి.