'ప్రైవేట్ సంస్థలూ అణు ఖనిజాల తవ్వకాలు జరపొచ్చు'

by Vinod kumar |
ప్రైవేట్ సంస్థలూ అణు ఖనిజాల తవ్వకాలు జరపొచ్చు
X

న్యూఢిల్లీ : లిథియం సహా మొత్తం 6 అణు ఖనిజ నిల్వల వేలంపాట, మైనింగ్ కార్యకలాపాల్లోకి ప్రైవేట్‌ రంగానికి తలుపులు తెరిచే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. గత నెలలోనే ఈ బిల్లు (గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు) లోక్ సభ ఆమోదాన్ని పొందగా, తాజాగా బుధవారం రాజ్యసభ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక భూమిలో అత్యంత లోతులో ఉండే బంగారం, వజ్రాలు, వెండి, రాగి, జింక్, సీసం, నికెల్, కోబాల్ట్, ప్లాటినం వంటి విలువైన ఖనిజాల మైనింగ్ కు కూడా ప్రైవేట్ రంగాన్ని అనుమతించేలా ఈ బిల్లులో ప్రపోజల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్వేషణ లైసెన్స్‌ని వేలం ద్వారా మంజూరు చేయాలనే నిబంధనను పొందుపరిచారు. దేశ ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు అవసరమైన కీలకమైన ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌ను పెంచడం కోసం ఖనిజ రంగానికి మరిన్ని సంస్కరణలు అవసరమని బిల్లులో పేర్కొన్నారు.

Advertisement

Next Story