బిల్కిస్ బానో కేసు.. నిందితుల విడుదలకు ఉపయోగించిన ఫైళ్లను కోరిన సుప్రీంకోర్టు

by Vinod kumar |
బిల్కిస్ బానో కేసు.. నిందితుల విడుదలకు ఉపయోగించిన ఫైళ్లను కోరిన సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలకు ఉపయోగించిన ఫైళ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరడాన్ని గుజరాత్ ప్రభుత్వం సవాల్ చేసే యోచనలో పడింది. ఈ కేసులో 11 మంది దోషులకు శిక్ష తగ్గింపు చేసే విడుదల చేయడంపై సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించడానికి నిరాసక్తగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. గత నెల 27న విడుదలకు ఉపయోగించిన ఫైళ్లను చూపించాలని గుజరాత్ ప్రభుతాన్ని, కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ కేఎమ్ జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం 11 మంది దోషులకు వారి ఖైదు కాలంలో మంజూరు చేసిన ఉపశమనాన్ని ప్రశ్నించింది. ‘గర్భిణీపై సామూహిక లైంగిక దాడితో పాటు కొందరిని హత్యచేశారు. దీనిని సెక్షన్ 302 కింద పోల్చి చూడకూడదు.

కేవలం ఒక హత్యలో ఉపయోగించినట్లుగా మినహాయింపు దీనికి ఇవ్వొద్దు. సమాజానికి, కమ్యూనిటికీ వ్యతిరేకంగా నేరాలు జరగుతాయని, ఎవరినైనా ఒకేరకంగా చూడాలి’ అని బెంచ్ పేర్కొంది. ఈ విషయంలో రెమిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం బుద్ధిని ఉపయోగించిందా అని ప్రశ్నించింది. ‘ఈ రోజు బిల్కిస్ రేపు ఇంకొకరు.. మీరు లేదా నేనే కావచ్చు.. మీరు కారణాలను చూపించకపోతే.. మేము సొంత నిర్ణయాలను తీసుకుంటాం’ అని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed