'దేశ వ్యతిరేక సంస్థలకు కాంట్రాక్టుల కేటాయింపుపై బ్యాన్'.. బీహార్ క్యాబినెట్ కీలక నిర్ణయం

by Vinod kumar |
దేశ వ్యతిరేక సంస్థలకు కాంట్రాక్టుల కేటాయింపుపై బ్యాన్.. బీహార్ క్యాబినెట్ కీలక నిర్ణయం
X

పాట్నా : బీహార్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ ఛానల్స్ తో ముడిపడిన కాంట్రాక్టులలో భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంస్థలకు అవకాశం దక్కకుండా నిషేధం విధించారు. ఈ వివరాలను బీహార్ సర్కారు అదనపు ప్రధాన కార్యదర్శి (క్యాబినెట్ సెక్రటేరియట్) ఎస్. సిద్ధార్థ ప్రకటించారు. ఇదొక సార్వత్రిక నిర్ణయమే తప్ప, ఒక్క చైనీయులకే వ్యతిరేకమైంది కాదని స్పష్టం చేశారు.

ఇకపై ఈ ఆదేశాలకు లోబడే రాష్ట్ర సర్కారు కొనుగోళ్లను చేస్తుందని తేల్చి చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ.37 కోట్లను మంజూరు చేసింది. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ఐ ఇన్‌స్టిట్యూట్‌ కోసం 149 పోస్టులను క్రియేట్ చేసే నిర్ణయానికి కూడా క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.

Advertisement

Next Story