కొత్త పార్లమెంట్ భవనం అవసరం ఏమొచ్చింది? (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-05-27 11:16:29.0  )
కొత్త పార్లమెంట్ భవనం అవసరం ఏమొచ్చింది? (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవం నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదని బిహార్ సీఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం చరిత్రాత్మకమైనదని అలాంటి భవనం కాదని కొత్త భవనం నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం, నీతి ఆయోగ్ కార్యక్రమానికి హాజరుపై శనివారం స్పందించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దేశ చరిత్రను మార్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ప్రయత్నాలు చేస్తున్నారని తాను పదే పదే చెబుతున్నానని ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్న ఆయన ఇవాళ్టి నీతి ఆయోగ్ సమావేశానికి, రేపటి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరవడంలో అర్థం లేదని అన్నారు.

Read more:

'ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుంది'.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ప్రధా మోడీ

మోడీ మీటింగ్ సమయంలో హైదరాబాద్‌లో ముగ్గురు సీఎంల భేటీ!

Advertisement

Next Story