పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. సర్కార్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఎక్కువగా విపక్ష పార్టీలో గెలిచిన వారే అధికార పార్టీ వైపు చూడటం, ఆ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతోన్న సందర్భాలే అనేకం కనిపిస్తున్నాయి. తాజాగా.. ఇలా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడుతుంది. అంతేకాదు.. ఈ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సైతం రద్దు కానుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలోని ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో వారిపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed