- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తం పార్టీకి బిగ్ షాక్: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ రాజీనామా
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రిజైన్ లెటర్‌ను పార్టీకి అందజేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘పార్టీపై తప్పుడు, దుర్మార్గపు అవినీతి ఆరోపణలను మోపడమే ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీనిని ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పొత్తుకే మొగ్గు చూపింది’ అని అరవిందర్ రిజైన్ లెటర్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీలో టికెట్ల పంపిణీపై అరవిందర్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఆప్‌తో పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఏఐసీసీ ఢిల్లీ ఇన్‌చార్జి దీపక్ బాబ్రియాతో ఇటీవల అరవిందర్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. అయితే క్రమశిక్షణా చర్యలు తీసుకునే నిర్ణయాన్ని ఏఐసీసీకే వదిలేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారు.
అరవిందర్ 15ఏళ్ల పాటు షీలా దీక్షిత్ ప్రభుత్వంలో విద్య, పర్యాటక మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహించారు. 2017లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అయితే కేవలం ఏడాదిలోపే మళ్లి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలోనే ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అరవిందర్ సింగ్ లవ్లీని గతేడాది కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్‌తో కాంగ్రెస్ ఢిల్లీలో పొత్తు పెట్టుకుంది. ఢిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లకు గాను ఆప్ నాలుగు, కాంగ్రెస్‌కు మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.