BIG News: మిస్టరీగా మెడికో హత్య కేసు.. నిందితుడి పాలీగ్రాఫ్ టెస్ట్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

by Shiva |   ( Updated:2024-08-26 06:12:48.0  )
BIG News: మిస్టరీగా మెడికో హత్య కేసు.. నిందితుడి పాలీగ్రాఫ్ టెస్ట్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. ఇన్సిడెంట్ జరిగి మూడు వారాలు అవుతోన్న అటు సీబీఐ.. ఇటు కోల్‌కతా దోషులెవరో ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. అదేవిధంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ తాజాగా ఆ హత్య తాను చేయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సంజయ్‌రాయ్‌కు సీబీఐ అధికారులు లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్) పరీక్ష నిర్వహించారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన సీబీఐ బృందం ఆదివారం ఉదయం జైలులోని ఆ పరీక్షను నిర్వహించింది. అయితే, ఆ పరీక్షలో సంజయ్ పొంతన లేని సమధానం చెప్పడం సీబీఐ అధికారులకు సవాలుగా మారింది. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లి చూసేసరికే లేడీ డాక్టర్ మరణించి ఉందని సంజయ్ లై డిటెక్టర్ టెస్టులో తెలిపినట్లుగా సమాచారం. ఆమె మృతదేహాం కనిపించగానే భయంతో పారిపోయానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్ సంజయ్‌కు అనేక ఆధారాలు చూపించి గట్టిగా ప్రశ్నించగా అత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నానన్న చెప్పినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed