- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
BIG BREAKING: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది దుర్మరణం
![BIG BREAKING: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది దుర్మరణం BIG BREAKING: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది దుర్మరణం](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415916-1.webp)
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)లో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం (Triveni Sangam) ఘాట్ వద్ద భక్తులు అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 30 మంది భక్తులు మరణించినట్లుగా డీఐజీ వైభవ్ కృష్ణ అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో దాదాపు 25 మంది వివరాలు సేకరించామని, మరో ఐదుగురి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు గాయపడిన 60 మంది క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు (Para Milatary Forces) వాలంటీర్లు (Valanteers) అంబులెన్స్‌లలో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రి (Central Hospital)కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య (Mouni Amavasya) సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతో ఊహించని స్థాయిలో తొక్కిసలాట చోటుచేసుకుంది.
మరోవైపు కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందన్న వార్తలపై స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా స్పందించారు. త్రివేణి సంగం రూట్లలో, కొన్ని బారికేడ్లు విరిగిపడటంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో పదులు సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయని ఆమె తెలిపారు.
సీఎం యోగీకి ప్రధాని మోదీ ఫోన్..
మహా కుంభమేళా (Maha Kumbhmela)లో తొక్కిసలాట జరిగిందనే విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నేరుగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) కు ఫోన్ చేశారు. ఈ మేరకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఫిబ్రవరి 13న ప్రధాని కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అదేవిధంగా తొక్కినలాట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Central Home Minister Amit Shah), సీఎం యోగిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని ఆయను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భరోసానిచ్చారు. తాజాగా, తొక్కిసలాట ఘటనలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.