TRAI: నిబంధనలు ఉల్లంఘిస్తే టెలికాం కంపెనీలకు రూ. 10 లక్షల జరిమానా

by S Gopi |
TRAI: నిబంధనలు ఉల్లంఘిస్తే టెలికాం కంపెనీలకు రూ. 10 లక్షల జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పామ్ కాల్స్, సందేశాలను తనిఖీ చేసే నిబంధనలను కఠినతరం చేసింది. టెలికాం కంపెనీలు అటువంటి కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి పదేపదే ఉల్లంఘనలకు పాల్పడటం, వాటి సంఖ్యలను తప్పుగా ఇస్తే రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు జరిమానాలు విధించనున్నట్టు స్పష్టం చేసింది. టెలికాం కంపెనీలు మొదటి ఉల్లంఘనకు రూ. 2 లక్షలు, రెండవసారి పునరావృతమైతే రూ. 5 లక్షలు, ఆపైన ఉల్లంఘనలకు, అటువంటి కాల్స్, మేసేజ్‌ల వివరాలను తప్పుగా నివేదిస్తే రూ. 10 లక్షల వరకు పెనాల్టీ ఉండనుంది. స్పాం కాల్స్‌ను గుర్తించేందుకు ఎక్కువ కాల్స్ రావడం, తక్కువ వ్యవధితో కూడా కాల్స్, ఇతర అంశాల ఆధారంగా కాల్స్, మెసేజ్‌లను విశ్లేషించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశించింది. ఇదే సమయంలో స్పామ్ మెసేజ్‌లను బ్లాక్ చేయడానికి, ఫిర్యాదులను నమోదు చేయడానికి, ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ట్రాక్ చేయడానికి వినియోగదారుల కోసం అప్‌డేట్ చేసిన డీఎన్‌డీ (డు-నాట్-డిస్టర్బ్) యాప్‌ను కూడా విడుదల చేసింది.

Next Story

Most Viewed