Birbhum: పశ్చిమబెంగాల్ లో హోలీ వేడుకల్లో ఘర్షణ.. ఈనెల 17 వరకు ఇంటర్నెట్ నిలిపివేత

by Shamantha N |   ( Updated:2025-03-15 18:04:59.0  )
Birbhum: పశ్చిమబెంగాల్ లో హోలీ వేడుకల్లో ఘర్షణ.. ఈనెల 17 వరకు ఇంటర్నెట్ నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ లో హోలీ సంబురాల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణ కాస్తా.. హింసాత్మకంగా మారింది. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు భారీ భద్రతా దళాలు మోహరించాయి. ఈ నెల 17 వరకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఘటనకు సంబంధించి 20 మందికిపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీర్ భూమ్ జిల్లాలోని సైంథియా ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణలకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఘర్షణలో కొంతమంది స్థానికులు గాయపడ్డారు. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉద్రిక్తతలపై బెంగాల్ హోంశాఖ చర్యలకు పూనుకుంది. పుకార్లు వ్యాప్తి చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి వాయిస్-ఓవర్-ఇంటర్నెట్ సౌకర్యాలను మార్చి 17 వరకు నిలిపివేసింది.

READ MORE ...

కాళకృత్యాలకు వెళ్లి కాలువలో గల్లంతైన యువకులు..


Next Story