- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rape: మత్తు మందు ఇచ్చి పేషెంట్‌పై లైంగికదాడి
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్(West Bengal)లో 26 ఏళ్ల మహిళ అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్లగా.. మత్తు మందు ఇచ్చి డాక్టర్(Doctor) ఆమెపై లైంగికదాడికి(Rape) దిగాడు. ఆ ఘటనను వీడియో తీసి.. ఆ తర్వాత కూడా పలుమార్లు బెదిరించి లొంగదీసుకున్నాడు. చివరికి బాధితురాలు తన భర్త సహాయంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లా హస్నాబాద్‌లో చోటుచేసుకుంది.
నూర్ ఆలం సర్దార్ అనే వ్యక్తి ఇంటిలోనే క్లినిక్ నడుపుకుంటున్నాడు. బరుణ్‌హట్ ఏరియాలోని ఆ క్లినిక్‌కు చికిత్స పొందడానికి ఓ మహిళ వచ్చింది. ఆ డాక్టర్ ఆమెకు సెడేటివ్స్ ఇచ్చాడు. మత్తులోకి జారిన తర్వాత ఆమెపై లైంగికదాడి చేశాడు. ఆ ఘటనను రికార్డ్ చేశాడు. వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి పలుమార్లు రేప్ చేశాడు. బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్పింది. ఇద్దరు కలిసి హస్నాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్టు బసిర్‌హట్ ఎస్పీ హొస్సెయిన్ మెహెదీ రెహమాన్ వివరించారు. నిందితులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. రేప్, మర్డర్ వంటి దారుణ నేరాలు చేసిన దోషులకు మరణ శిక్ష వేసేలా చట్టాన్ని కఠినతరం చేస్తూ టీఎంసీ సర్కారు గత నెలలోనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.