Padma Hilsa : పద్మా హిల్సా ఎగుమతిపై బంగ్లాదేశ్ బ్యాన్.. దుర్గా పూజలు సమీపించిన వేళ షాక్

by Hajipasha |
Padma Hilsa : పద్మా హిల్సా ఎగుమతిపై బంగ్లాదేశ్ బ్యాన్.. దుర్గా పూజలు సమీపించిన వేళ షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : దుర్గాపూజ వేడుకలు అక్టోబరు రెండో వారంలో జరగనున్నాయి. బెంగాల్‌లో జరిగే దుర్గాపూజ సెలబ్రేషన్స్ చాలా స్పెషల్. ఎందుకంటే అక్కడ దుర్గామాతకు నైవేద్యంగా చేపలను కూడా సమర్పిస్తుంటారు. ఇందుకోసం భక్తులు ఏటా పెద్దమొత్తంలో పద్మా హిల్సా చేపలను కొనుగోలు చేస్తుంటారు. ఈ చేపలకు కేరాఫ్ అడ్రస్ బంగ్లాదేశ్. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు ఏటా ఆగస్టు నుంచి అక్టోబరు వరకు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు పెద్దఎత్తున పద్మా హిల్సా చేపలను ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆ చేపల ఎగుమతిపై బ్యాన్ విధించింది.

దీంతో ఈసారి దుర్గా పూజల వేళ బెంగాల్‌లో పద్మా హిల్సా చేపల కొరత ఏర్పడబోతోంది. తమ దేశంలో ఆ చేపల ధరలను నియంత్రించే క్రమంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆ దేశ మత్స్యశాఖ సలహాదారుడు ఫరీదా అఖ్తర్ ఓ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో ఇటీవలే మారిన రాజకీయ పరిణామాలతో భారత్ వ్యతిరేక సెంటిమెంట్ ఏర్పడిందని.. ఆ క్రమంలోనే పద్మా హిల్సా చేపల ఎగుమతిపై బ్యాన్ విధించారని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed