- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4 చేతులు, 4 కాళ్లతో శిశువు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ఛాప్రా (బీహార్) : 4 చేతులు, 4 కాళ్లతో శిశువు జన్మించింది.. పుట్టిన 20 నిమిషాలలోనే తుది శ్వాస విడిచింది. బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛాప్రాలోని శ్యామ్‌చక్‌లో ఉన్న సంజీవని నర్సింగ్ హోమ్‌లో ప్రియా దేవి అనే మహిళ 4 చేతులు, 4 కాళ్లతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు తల ఆకారం కూడా అసాధారణంగా ఉంది. దీంతో ఆ పసికందును చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కొంతమంది ఇది దైవిక అవతారమని చెప్పగా.. ఇంకొంతమంది జీవ సంబంధమైన క్రమరాహిత్యం వల్ల శిశువు ఇలా పుట్టిందన్నారు. దురదృష్టవశాత్తు ఈ శిశువు జన్మించిన కొద్దిసేపటికే చనిపోయింది.
ఈ శిశువుకు రెండు వెన్నుపాములతో పాటు ఒకే తల, నాలుగు చెవులు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు గుండెలు ఉన్నాయని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ వెల్లడించారు. గర్భాశయంలోని ఒకే అండంలో రెండు పిండాలు అభివృద్ధి చెంది.. కవలల విభజన అసంపూర్తిగా జరిగితే ఇలాంటి ప్రత్యేక లక్షణాలతో పిల్లలు పుడతారని వివరించారు.