అయోధ్యలో ఘనంగా దీపోత్సవం వేడుకలు.. రెండు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులు కైవసం

by Mahesh |
అయోధ్యలో ఘనంగా దీపోత్సవం వేడుకలు.. రెండు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులు కైవసం
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగను పురస్కరించుకొని.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh govt) ఆధ్వర్యంలో అయోధ్య(Ayodhya)లో సరయూ నది సమీపంలో దీపోత్సవ వేడుకలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం సీఎం యోగి ఆధిత్యనాధ్(CM Yogi Adhityanath) ముఖ్య అతిథిగా పాల్గొని ఈ దీపోత్సవం (Dipotsavam) వేడుకలను ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం జరిగిన ఈ దీపోత్సవ వేడుకలు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించాయి. అత్యధిక మంది వ్యక్తులు ఏకకాలంలో 'దియా' భ్రమణాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అలాగే 25,12,585 దీపాలతో అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శించినందుకు మరో గిన్నిస్ రికార్డును నెలకోల్పారు. కాగా ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సభ్యులు హాజరయ్యారు. దీపోత్సవ వేడుకల అనంతరం ఈ వేడుక సాధించిన రెండు రికార్డులను ప్రకటించారు. కాగా ఇదే వేడుకల్లో డ్రోన్ షో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఘాట్ కు ఒక కిలో మీటర్ దూరంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దృష్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed