- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనీసం దేశాభివృద్ధినైనా తెలుసుకుంటారు: రాహుల్‌పై బీజేపీ నేత సెటైర్లు
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్న ‘భారత్ న్యాయ్ యాత్ర’పై బీజేపీ ఎంపీ రవి కిషన్ సెటైర్లు వేశారు. ఈ యాత్ర ద్వారా ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన దేశాభివృద్ధిని రాహుల్ తెలుసుకుంటారని వెల్లడించారు. రాహుల్ విదేశాలకు వెళ్లడంపై స్పందిస్తూ, ఈ యాత్ర ద్వారానైనా రాహుల్ విదేశాలకు వెళ్లకుండా ఉంటారని తెలిపారు. ఈ మేరకు రవి కిషన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేయడం చాలా మంచి విషయం. ఇలాంటి యాత్రలు మరిన్ని చేయాలి. రాహుల్ ప్రతిపక్షంలోనే మిగిలిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, కనీసం ఈ యాత్ర ద్వారానైనా దేశం గురించి తెలుసుకుంటారు. 65ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి.. మోడీ పాలనలో ఎలా జరిగిందో అతని కళ్లారా చూస్తారు. రహదారుల అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం ప్రధాని చేసిన కృషిని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందో తెలుసుకుంటారు’’ అని వెల్లడించారు. కాగా, భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ చేపట్టనున్న ‘భారత్ న్యాయ్ యాత్ర’ జనవరి 14 నుంచి మార్చి 20 వరకు సాగనున్న విషయం తెలిసిందే. ఇంఫాల్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ముంబైలో ముగియనుంది. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగనుంది. యాత్ర సమయంలో యువత, మహిళలు, పేద ప్రజలను రాహుల్ కలవనున్నారు.