Israel: కాల్పుల విరమణ ఒప్పందం వేళ దాడులకు తెగబడ్డ ఇజ్రాయెల్..!

by Shamantha N |
Israel: కాల్పుల విరమణ ఒప్పందం వేళ దాడులకు తెగబడ్డ ఇజ్రాయెల్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే మరో షాకింగ్ ఘటన జరిగింది. గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం (Gaza ceasefire deal) ఆదివారం నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ గాజాపై పెద్దఎత్తున విరుచుకుపడింది. ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గరుయ్యారు. పలు భవనాలు కుప్పకూలగా.. చాలా మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. కాగా.. యుద్ధాన్ని ముగించేందుకు.. కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్‌ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటినుంచి మద్దతుగా ఉండగా.. ప్రస్తుతం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించింది. ఎట్టకేలకు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్‌ తెలిపింది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌థానీ ప్రకటించారు. కాగా.. ఇలాంటి సమయంలో గాజాపై దాడులు జరగడం గమనార్హం.

ఇజ్రాయెల్ పై దాడి

2023, అక్టోబర్ లో ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు విడుదల కాగా.. మరికొందరు చనిపోయారు.. ప్రస్తుతం 51 మంది మాత్రమే బందీలుగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరిగాయి. హమాస్ కు మద్దతుగా హెజ్ బొల్లా, హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పరం మిసైల్ దాడులకు పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు.

Next Story