ఒక ముస్లింగా నాకు ఆ అలవాటు లేదు.. కానీ 'నమస్తే' చాలా ఫవర్‌ఫుల్: హీరో అమీర్ ఖాన్

by Disha Web Desk 12 |
ఒక ముస్లింగా నాకు ఆ అలవాటు లేదు.. కానీ నమస్తే చాలా ఫవర్‌ఫుల్: హీరో అమీర్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారీ సినిమాలతో వందల కోట్ల కలేక్షన్లను ఆయన కొల్లగొట్టారు. అలాగే తనదైన శైలిలో ఆయా సంఘటనలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా హిందూ సాంప్రదాయంలో నమస్తే పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఈ సారి ఆయనకు హిందువులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇటీవల అమీర్ ఖాన్.. మాట్లాడుతూ.. నేను ఒక ముస్లింను.. నాకు చేతులు జోడించి నమస్కారం పెట్టే అలవాటు లేదు. నేను నా చేతిని పైకెత్తి (ఆదాబ్ అని సైగ చేయడం, ముస్లింలు ఒకరినొకరు పలకరించుకునే విధానం)విధానం, అలాగే తల వంచడం మాత్రమే అలవాటు చేసుకున్నాను. కానీ దంగల్ సినిమా షూటింగ్ సమయంలో నేను.. 'నమస్తే' పెట్టడం నేర్చుకున్నారు. అలాగే ఆ సమయంలోనే భారత సాంప్రదాయం అయిన "నమస్తే" అటువంటి అద్భుతమైన భావోద్వేగమని నేను గ్రహించానని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దీనిపై కొందరు వ్యక్తులు అలా ఎలా చెబుతావని విమర్శలు చేస్తున్నారు. దీంతో అమీర్‌కు సపోర్ట్ గా హిందువులు నిలబడుతున్నారు.

Read More..

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న యంగ్ బ్యూటీ.. అలాంటి సీన్స్‌లో నటించాలంటే ఆ పని చేయాల్సిందేనంటూ కండీషన్!



Next Story

Most Viewed