Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సమన్లు

by Shamantha N |
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ ను రౌజ్ ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఆరుగురు నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరుగురు నిందితులు కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్ మరియు పి. శరత్ రెడ్డిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్‌ 11న విచారణ జరుగనున్నది. సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులపై విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. ఈ కేసులో కేజ్రీవాల్‌, పాఠక్‌లను విచారించేందుకు అవసరమైన ఆంక్షలను పొందినట్లు సీబీఐ గత నెలలో కోర్టుకు తెలియజేసింది.

విజయ్ నాయర్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ కమ్యూనికేషన్ మాజీ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో మార్చి 21న ఈడీ విజయ్ నాయర్ ను అరెస్టు చేసింది. కాగా.. 23 నెలల జైలు శిక్ష తర్వాత సుప్రీంకోర్టు సోమవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Next Story

Most Viewed