150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు.. త్వరలో ఎన్ఎంసీ నిర్ణయం!

by Vinod kumar |
150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు.. త్వరలో ఎన్ఎంసీ నిర్ణయం!
X

న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే 150 మెడికల్ కాలేజీలు గుర్తింపు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. ఫ్యాకల్టీ కొరత, నిబంధనల పాటించకపోవడం వంటి కారణాలతో ఆయా కళాశాలల గుర్తింపును ‘నేషనల్ మెడికల్ కమిషన్’(ఎన్ఎంసీ) రద్దు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 40 మెడికల్ కాలేజీలు గుర్తింపు కోల్పోయాయని పేర్కొన్నాయి. గుర్తింపు కోల్పోనున్న జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, అసోం, పుదుచ్చెరీ, తమిళనాడు, త్రిపుర, బెంగాల్ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఎన్ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయని, సీసీటీవీ కెమెరాలు, ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ హాజరు విధానాలు, ఫ్యాకల్టీ రోల్స్‌లోని గుర్తించినట్టు వెల్లడించాయి. అయితే, ఎన్ఎంసీ గుర్తింపు కోల్పోకుండా ఉండేందుకు సదరు కాలేజీలు అప్పీల్ చేసుకోవచ్చని, 30 రోజుల్లోగా సరైన సదుపాయాలు కల్పించి, అర్హతను అందుకోవచ్చని పేర్కొన్నాయి. ఇందుకు, ఎన్ఎంసీ అవకాశం ఇవ్వకపోతే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను సంప్రదించొచ్చని తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed