- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
APP: ఢిల్లీ జోరుగా ప్రచారాలు.. నేడు ఆప్ నేత కేజ్రీవాల్ నామినేషన్

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరిగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజధానిలో కూడా పై చేయి సాధించాలని చూస్తోంది. మరో వైపు కాంగ్రెస్ ఢిల్లీలో హస్తం జెండా ఎగురవేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ ఎన్నికల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. ప్రముఖ రాజకీయ నేతలు ఒక్కోకరుగా నామినేషన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేడు నామినేషన్ వేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆయన హనుమాన్, వాల్మీకీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆప్ కార్యకరర్తలు, నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు.