లాలూ కుటుంబానికి మరో షాక్: ఉద్యోగాల స్కాం కేసులో రబ్రీదేవి, కుమార్తెలపై ఈడీ చార్జ్‌షీట్

by samatah |
లాలూ కుటుంబానికి మరో షాక్: ఉద్యోగాల స్కాం కేసులో రబ్రీదేవి, కుమార్తెలపై ఈడీ చార్జ్‌షీట్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో లాలూ భార్య మాజీ సీఎం రబ్రీదేవి, ఆయన కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లపై ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ అప్పీల్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై జనవరి 16న విచారణ జరగనుంది. ఈ కేసులో గతేడాది నవంబర్‌లో లాలూ ప్రసాద్ కుటుంబానికి సన్నిహితుడైన అమిత్ కత్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఇదే టైంలో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లకుు కూడా సమన్లు జారీ చేసింది. కాగా, గతంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story